Wednesday, August 14, 2013

స్వంత ఆలోచన లేని రాజకీయ పార్టీలు

రాజకీయ పార్టీలు ఉద్యమాలకు సారధ్యం వహించాలి. కాని నేడు జరుగుతున్నదేవిటి? ఉద్యమాలు రాజకీయ పార్టీలను ఎటు వీలైతే అటు తీసుకుపోతున్నాయి. తెలంగాణలో ఉద్యమం జరిగినన్నాల్లు పార్టీలన్నీ అటువైపు మాట్లడితే, ఇప్పుడు మళ్ళీ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి  ఇటువైపుకు తిరగడం రాజకీయ పార్టీల పనౌతోంది. ఇలా ఎందుకు? తమకు స్వంత ఆలోచన లేకపోవడం వలననే. ఇలాంటి స్వంత ఆలోచనలు లేని పార్టీలతో మనం ఉన్నన్నాళ్ళు మన గతి ఇంతే. ఇప్పటికైనా స్వంత ఆలోచన కలిగిన సిసిఎం లాంటి పార్టీలను నమ్ముకోవడం మేలు. రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఏది మంచి, ఏది చెడు  అనే విషయాన్ని వివరించగలగాలి. అంతే కాని ఎటుగాలి వీస్తే అటవైపు  వంగే  పార్టీలను ఇప్పటికైనా వదిలించుకుందాం.