Sunday, October 16, 2011

కొండను త్రవ్వి ఎలకనైనా పట్టని సకలజనులసమ్మె


సకలజనుల సమ్మెనుండి ఆర్టీసీ కార్మికులు నిన్న, ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు జారుకోవడం జరిగింది. ఇక మిగిలింది తెలంగాణ ఉద్యోగుల సంఘం మరియు సింగరేణి ఉద్యోగుల సంఘం. ఇవికూడా రేపో మాపో విరమించక తప్పని పరిస్థితి. లేనట్లయితే నష్టపోయేది వారూ మరియు తెలంగాణ ప్రజలు తప్ప ఎవరికీ లాభంలేదు. కేంద్రం ఇప్పట్లో దిగివచ్చే సూచనలు లేవు. అలాంటపుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఏసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు చేసింది ఏమీ ఉండదు. రాజకీయ పార్టీలతో కావడంలేని పనిని ఉద్యోగ సంఘాలు చేయబూనడమే సరియైన నిర్ణయం కాదు. నెలరోజుల పాటు చేసి సాధించిందేమీ లేదు, పైగా నెల రోజుల వేతనాన్ని పోగొట్టుకున్నారు. అంతేకాదు ప్రజలకు తీరని కష్టాలు తెచ్చి పెట్టారు. విద్యార్థులకు విద్యని, రైతులకు కరెంటులేక పొలాలా ఎండబెట్టుకునేలా చేసారు. ఆర్టీసి తట్టుకోలేని నష్టాలకు గురైంది. ఇంతచేసి సాధించింది ఏమిటి. సమస్యను కేంద్రం అర్థం చేసుకునేలా చేసామని చెబుతారు కాని, దానికి సమస్య తెలవదనుకోవడమే తెలివితక్కువ తనమౌవుతుంది. దీని మొత్తం అర్థం కొండను త్రవ్వారు కానీ ఎలకను కూడా పట్టలేదనే.

No comments:

Post a Comment