Wednesday, October 12, 2011

సకల జనుల సమ్మె – ఉద్యోగుల పరిధులు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలలో సెప్టెంబర్ 13, 2011 నుండి తెలంగాణ పది జిల్లాలు కలిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సకలజనుల సమ్మె జరుగుతోంది. ఈ కోరిక న్యాయమైనదా? కాదా?  అనే విషయాన్ని ప్రక్కన పెడితే, ఈ సమ్మెలో పది జిల్లాల్లో దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్నాయి. కొన్ని సంఘాలు సమ్మెలో పాల్గొనకపోయినా మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్న సమ్మె కావటాన దానికి వ్యతిరేకంగా పని చేయకూడదని నిర్ణయించి విధులకు హాజరు కావడంలేదు. విధులకు హాజరు అవుతామన్నా సక్రమంగా విధులు నిర్వహించే అవకాశం కూడా లేదు. ఉద్యోగ సంఘాల ఈ సమ్మె వలన ప్రజలు అనేక రకాల ఇబ్బంధులకు గురి అవుతున్న నేపథ్యంలో ఈ సమ్మె సాధించ గలిగేది ఏమిటన్నది చర్చనీయాంశమయింది.
       తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమం కొత్తది కాదు. 1969 నుండి ఈ ఉద్యమం సాగుతోంది. ఈ సమస్య రాజకీయ సమస్య. రాజకీయ సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు రాకముందే వారిని ముందుకి తీసుకరావడానికని ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తున్నాయి. ఒక నెల గడుస్తున్నా కూడా రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారానికి ముందుకు రావడంలేదు.  ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, మెదలైన రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారానికి ముందుకు రావడంలేదు. గమనించవలసింది టీఆర్ఎస్ కూడా అని. టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పటు చేసుకోవడానికే పుట్టిన రాజకీయ పార్టీ అయినప్పటికీ అది అందుకు ముందుకు వస్తున్న వారిని కలుపుకు పోవడంలొ చొరవచూపడంలేదు. పైగా వారిని ఎలా అయినా చేసి వారు తెలంగాణకు వ్యతిరేకులే అనే ముద్ర వేయాలనేది వారి ఆలోచన. సిపిఐ, బిజెపి, సిపిఎం, లోక్ సత్తా లాంటి వాటి నిర్ణయాలతో అంత ప్రభావితం అయ్యే అంశం కాదిది.
       రాజకీయ పార్టీలలో సమస్య పరిష్కారానకి కావల్సిన చొరవ లేనపుడు ఉద్యోగ సంఘాల సమ్మెవలన ఒరిగేదేముంటుంది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేనట్లయితే ఈ సమ్మెవలన నష్టపోయేది ఏ ప్రజల కొరకైతే సమ్మెచేస్తున్నారో వారికే ఇది నష్టాన్ని చేకూర్చనదౌవుతుంది. రాజకీయ పార్టీలు పరిష్కరించవలసిన సమస్యను తలెకెత్తుకోవడం ఉద్యోగుల పని కాదు. ఉద్యోగులు కూడా ప్రజలలో భాగమే కాబట్టి వారికి వారి ఆకాంక్షను వెళ్ళడించే అవకాశం ఉండవలసిందే. కాని ఉద్యోగులు ప్రభుత్వ సేవకులు. వారు ప్రభుత్వ ఆదేశాలను పాటించడమే వారి ప్రధాన కర్తవ్యం అవుతుంది. ఆ ప్రధాన కర్తవ్యాన్ని వదిలిపెట్టి తామే తమ ఆకాంక్షలకు అనుగుణంగా సమ్మెకు వెళ్లడం సరిఅయినదికాదు. వారి సమస్యల(తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లాంటి)ను పరిష్కరించుకోవడానికి అయితే వారు ఉద్యోగానికి రాజీనామా చేసి అయినా పరిష్కరించుకోవాలి. లేదా వారు ఏ రాజకీయ పార్టీలకయితే ఓట్లు వేస్తున్నారో ఆ పార్టీల ద్వారానే పరిష్కరించుకోవాలి. అంతే కాని ఇలాంటి సమస్యలపై పరిష్కారానికి సమ్మెచేయడం వారికి తగని పని. ఉద్యోగుల పని పరిస్థితుల గురించి గాని, వేతనాల గురించికాని సమ్మె చేసే హక్కు వారిక ఉంటుంది కాని ఇలాంటి సమస్యలపై సమ్మె చేసే హక్కు వారికి లేదు. ఇప్పటికైనా విషయాన్ని గుర్తించి వెంటనే సమ్మెనుండి వైదొలగడం వారికే మంచిది. ప్రజలనుండి తిరుగుబాటు వచ్చేదాకా  ఆగితే నష్టపోయేది వారే. ఎందుకంటే రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లాంటి  ఆలోచన లేదని ఉద్యోగులే దానికొరకు ముందుకు వస్తున్నారనే సంకేతం వెళుతుంది.
       ఈ బ్లాగ్ ఉద్దేశం సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు బాధ్యత వహించేలా చేయాలి కాని, వారి పని తామే తెలకెత్తుకోకూడదు. ఆ రాజకీయ పార్టీలలో స్పందన లేనపుడు వాటిని నమ్ముకోవద్దని, సమస్య పరిష్కారానిక ముందుకు వచ్చే పార్టలను మాత్రమే ప్రోత్సాహించే విధంగా వారి కార్యాచరణ ఉండాలి. అదే సమయంలో వారికి గల పరిధిలోనే వారు ఉద్యమాన్ని నడపాలి. పరిధిని అతిక్రమించడం ఎవరికీ మంచిదికాదు.

No comments:

Post a Comment