Wednesday, August 24, 2011

అవినీతి నిర్మూలనకోసం హజారే దీక్ష - బాగోగులు

                 అన్నా హజారే దేశంలోని రాజకీయ అవినీతిని నిర్మూలించడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు దేశంలోని ప్రజలందరు సంఘీభావం తెలపడం ఆ పోరాటంలో పాల్గొనడం చాలా చాలా హర్షించదగింది. నేను కూడా అన్నా దీక్షకు మద్దతు తెలుపుతున్నాను. అయితే అవినీతిని అంతమొందించడంలో అన్నా దీక్ష ఎంతవరకు సత్ఫలితాన్నిస్తున్నదనేది పరిషీలించవలసిన అంశం. ఇంకొక వైపు ఈ దీక్ష ఎవరూ ఆశించకపోయినా మంచిఫలితాన్ని ఇవ్వక మరింత చెడు ఫలితాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉన్నందున ఈ అంశాన్ని లోతుగా పరిశీలించవలసియున్నది. అందులో భాగంగానే నా అభిప్రాయాల్ని ఇక్కడ ఉంచుతున్నాను.

                  దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అనేక మార్లు అనేక మంది మాట్లాడటం జరిగింది. అయితే ఆ విషయాలు అన్నీ ప్రజానీకంలోకి వెళ్ళలేదు. అందుకు మీడియాదే బాధ్యత. ఉదాహరణకు 2010, ఫిబ్రవరి    23వ తేదీన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వేలాదిమందితో దేశంలోని 9 వామ పక్షాలు పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కాని ఆ వార్తని ఇటు పత్రికలు గాని, అటు టెలివిజన్ ఛానల్స్ గాని దానిని ప్రజలకు చేరవేయలేదు. ఆ తరువాతనే అన్నా దీక్షకు పూనుకున్నాడనేది గమనించాలి. ఇంతెందుకు 2జి స్పెక్ట్రం కుంభకోణం గురించి సిపిఎం ఎంపి సీతారం ఏచూరి పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. కాని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు.  ముఖ్యంగా దేశంలో ప్రధాన ప్రతిపక్షం బిజెపి నోరు మెదపలేదు. కాగ్ అక్షింతలు వేసింతరువాతనే ప్రభుత్వం దిగివచ్చింది. అప్పుడుకూడా ఏదో సాదాసీదా విచారణ చేసి చేతులు దులుపుకోవాలని చూసింది ప్రభుత్వం. జెపీసి వేసి విచారణ జరిపించాలని లెఫ్టు అనేక విధాలుగా వత్తిడి తెస్తేనే కనీసం ఈ విచారణ అయినా జరుగుతోంది. అన్నాకన్న ముందుగానే అవినీతికి వ్యతిరేకంగా వామ పక్షాలు ముందుకు వచ్చాయి అని చెప్పడానికే ఈవిషయాలన్నిటిని ప్రస్తావించవలసి వచ్చింది.

                   అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే దీక్షను అభినందించవలసిందే. అందుకు ఎవరూ వెనకాడకూడదు. అంతేకాదు ఈరోజు ఆయన చేస్తున్న ప్రయత్నం వలననే కనీసం లోక్ పాల్ బిల్లుకు ఒక రూపం వచ్చింది. అయితే బిల్లులో కేంద్రంలో ప్రధానమంత్రని, అలాగే రాష్ట్రంలో లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రని తీసుకుని రావలనే డిమాండు కూడా అంగీకరించవలసినదే. కాని అదే సందర్భంలో సుప్రీం కోర్టు న్యాయ మూర్తులను, దేశ త్రివిద దళాధిపతులూ అందరూ లోక్ పాల్ పరిధిలోకే రావాలని  కోరడం సమంజసం కాదు. మనదేశంలో శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్వవస్థ, కార్య నిర్వహక వ్యవస్థలు మూడు దేనికదే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. కాని రాజ్యాంగానికి వ్వతిరేకంగా అన్నా హజారే గారు ఈ మూడు వ్వవస్థలపై అధికారాలు కలిగిన లోక్ పాల్ కావాలంటాడు. ఆ లోక్ పాల్ ఎవరికీ జవాబుదారీ కాదు. మరి ఆ లోక్ పాల్ తప్పు చేయడనే గ్యారంటీ ఏమిటి? అప్పుడు ఎవరిని అడగాలి. ఎవరికీ జవాబుదారికాని వ్యక్తి ఒకవేళ మంచివాడు కాకపోతే అప్పుడు అతను నియంతగా మారడా? అలా అయినపుడు అది ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాదని నియంత్రుత్వాన్ని కోరుకున్నట్లుకాదా?  నియంత్రుత్వానికి దారితీసే లోక్ పాల్ ని కాదుకదా ప్రజలు కోరుకుంటున్నది. కాబట్టి అన్నా చెబుతున్న జనలోక్ పాల్ బిల్లునందు ప్రజాహితమైన అంశాలు కాకుండా ప్రజలకు అన్యాయం చేసే అంశాలు కూడా ఉన్నాయి.
                 పై అన్ని విషయాలను పరిశీలిస్తే ప్రభుత్వం ప్రకటించిన లోక్ పాల్ గాని, అన్నా కోరుతున్న జనలోక్ పాల్ బిల్లు విషయంగా గాని పార్లమెంటులో విస్త్రుత చర్చ జరగాలి. ఆ తరువాతే లోక్ పాల్ బిల్లు ఆమోదించాలి. అంతేకాని ఏ చర్చా లేకుండా అన్నా బ్రుందం కోరుతున్న జనలోక్ పాల్ ని ఏర్పాటు చేసుకోవడం మరిన్ని సమస్యలను కోరితెచ్చుకోవడమే. అదేవిధంగా తప్పులు జరుగుతున్నప్పటికీ, ప్రజలకు బాధ్యత వహిస్తున్న, రాజ్యాంగ బధ్ధమైన పార్లమెంట్ నే అత్యున్నత వ్వవస్థ గా ఉంచుకోవాలి. అది తప్పు చేస్తే దానికి పరిష్కారాన్ని ప్రజలు చూపించగలరని ఎన్నోసార్లు రుజువు అయింది.

                    
               





                

No comments:

Post a Comment